అదృష్టం కలిసి వచ్చిన వేళ ….ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం
వ్యవసాయకూలీని అదృష్టం వరించింది
అదృష్టం కలిసి వచ్చిన వేళ ….ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం
అమరావతి ప్రయత్నం న్యూస్
: ఒక్కొక్కసారి అదృష్టం ఎవరికి చెప్పకుండా వారికి తెలియకుండా తలుపు తడుతుంది అటువంటి అదృష్టం చెల్లకూరు అనే మండలంలో ఒక వ్యవసాయ రైతు కూలీకి కలిసి వచ్చింది ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసొచ్చింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారెవరూ పోటీ చేయకపోవడంతో
. తెదేపాలో సామాన్య కార్యకర్తగా ఉన్న అతను జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిల్లకూరు మండలంలోని ఏరూరు పంచాయతీ పరిధిలోని అల్లీపురం గిరిజన కాలనీకి చెందిన ఆడిపూడి బాలసుబ్రహ్మణ్యం కూలిపనులకెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల జడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించారు. దీంతో స్థానిక తెదేపా నాయకుల సహకారంతో ఎన్నికల బరిలో నిలిచారు. బాలసుబ్రహ్మణ్యంతోపాటు ఆయన తండ్రి అంకయ్య నామినేషన్ దాఖలు చేశారు. అంకయ్య తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో బాలసుబ్రహ్మణ్యం ఎన్నిక లాంఛనమైంది. చిన్న వయసున్న అతడిని జడ్పీటీసీ పదవి వరించింది. మండలాన్ని ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలుగా బాగు చేసేందుకు కృషి చేస్తానని చెప్పుకుంటున్నారు



