అనగా అనగా ఒక తాసిల్దార్…. చాలా సిన్సియర్…
రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే..... ఆఫీసుకు వెనుకదారిని పంపిస్తాడు
అనగా అనగా ఒక తాసిల్దార్…. చాలా సిన్సియర్…
చేవెళ్ల మండలంలో ఒక ఫామ్ హౌస్ నిర్మించారు…. ఒక్క రూపాయి లంచం తీసుకోడు….
న్యాయం కోసం వచ్చిన వారిని…. నిలబెడతాడు

ఆంధ్రాలో చెట్లు…. ఒరిస్సా లో చెక్క…. తెలంగాణలో బండలు…. వెరసి ఫామ్ హౌస్
నేను ఎవరికీ చిక్కను….. అంటే ఎలా సారు
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
ఆయన ఒక సిన్సియర్ తాసిల్దార్ చాలా కాలం అయిన ఇంకా ఆయనకి ప్రమోషన్ రాలేదు పనిలో వెనక ముందు చూడడు…. ఎవరి మాట వినడు…. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకో….. అలాగని ఒక్కరిని కూడా వదలడు…. అందరికీ న్యాయం చేస్తానంటాడు ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులందరూ చాలా సిన్సియర్ గా ఉండాలి. ఆయన చెప్పినట్టే పని చేయాలి. ఆయన మాటే వినాలి. మరి ఎవరి మాట వినకూడదు. ఆయన ఎదురు కుర్చీ ఉండకూడదు అతనితో కూర్చొని మాట్లాడాలంటే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయి ఉండాలి ఆయనకు అడగడం తెలియదు తీసుకోవడం మాత్రమే తెలుసు ఎన్ని సుగుణాలు ఉన్న ఆ తాసిల్దార్ ఎవరు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఏం చేశారని ఇప్పుడు ఆయన్ని బయటకి తీస్తారు అనే మాట ఒకటి ఉంది హైదరాబాద్ కి సమీపంలో ఉన్న చేవెళ్ల మండల పరిధిలో ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉంది ఎవరైనా ఆయన దగ్గరకు సహాయం కోసం వెళితే చిన్న వాళ్ళని అది కూడా గుంటలు లేక భూమి ఉన్న వారిని అసలు ఆయన అడగడు వారితో మాట్లాడడు వారి గురించి పట్టించుకోడు ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటే మహా ఇష్టం. మీరు కాకుండా అడ్వకేట్స్ అంటే ఇంకా ఇష్టం ఆయన మాట వినే వారంటే ఆయనకు ఎంతో ఇష్టం వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ఒక ఫామ్ హౌస్ నేర్పించారు దాంట్లో వండుకోవడానికి కూర్చుని తింటానికి అలాగే దాని రూపురేఖలు సరిగ్గా చేయడానికి సుగందాలు వెదజల్లే చెట్లు నాటడానికి అన్నిటికీ ఒక ప్రత్యేకమైన చెట్లు గాని చెక్కలు గాని బండలు గాని లైటింగ్ గాని అన్ని కావాలి అంటే ఆయనకు కావలసినవన్నీ చేయడానికి ఎక్కువ మంది బిల్డర్లు లాయర్లు మరియు వ్యాపారస్తులు కావాలి ఒక్కొక్కరి చేత ఒక్కొక్క పని చేయించుకుంటారు ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఆయన చేత్తో తీసుకోరు మరి ఇలాంటి మంచి వ్యక్తిని ఎక్కడ చూసి ఉండడం త్వరలో అందరికీ ఆయన పరిచయం చేయబోతున్నాం ఫామ్హౌసే కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నిటిని కూడా ఒకేసారి పరిచయం చేయడానికి మా ప్రయత్నం పత్రిక తరపున ప్రయత్నం చేస్తున్నాం
..


