24 ఏళ్లకే మున్సిపల్ చైర్‌పర్సన్.. రాజకీయాల్లోకి వచ్చి 10 రోజులే.. ఏకగ్రీవంగా ఎన్నిక!
వైద్యం నుంచి రాజకీయాల్లోకి..
24 ఏళ్లకే మున్సిపల్ చైర్‌పర్సన్.. రాజకీయాల్లోకి వచ్చి 10 రోజులే.. ఏకగ్రీవంగా ఎన్నిక!
రాజంపేట, అన్నమయ్య జిల్లా: హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో అరుదైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాజంపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 24 ఏళ్ల యువ వైద్యురాలు దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన గాయత్రి ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుల్లో ఒకరిగా రికార్డు సృష్టించారు.

ఈ ఏడాదే బీడీఎస్ (BDS) వైద్య విద్యను పూర్తి చేసిన గాయత్రి, రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొన్ననే. రాజకీయాల్లోకి వచ్చిన కేవలం పది రోజుల్లోనే నేరుగా మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆమె తండ్రి దొంతం శివప్రసాద్ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
వైద్యురాలిగా ప్రజాసేవ చేయాలనుకున్న గాయత్రి, ఇప్పుడు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. ఆమె ఎన్నిక పట్ల స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


