సినిమాలు

“నేచర్” మూవీ లోని “నిన్నే చూడందే.లిరికల్ సాంగ్ ను లాంచ్ చేసిన కమెడీయాన్ ఆలీ

 

ప్రకృతి ని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేదే “నేచర్” చిత్ర కథాంశం. శ్రీ సప్తమ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణ , ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి.యశోదమ్మ,,టి. చేతన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేచర్”. తలకోన, తిరుపతి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. వినాయక చవితి సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్రం లోని “నిన్నే చూడందే” లిరికల్ సాంగ్ ను ముఖ్య అతిధిగా వచ్చిన కమెడియన్ అలీ ఘనంగా విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమం లో నటుడు కృష్ణుడు, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, కమెడియన్ గౌతమ్ రాజు లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

ముఖ్య అతిధిగా వచ్చిన కమెడీయన్ అలీ మాట్లాడుతూ.. గౌతమ్ రాజు నేను ఎవరి సపోర్ట్ లేకుండా తన స్టైల్ లో తను , నా స్టైల్ లో నేను ఎదిగి ఇండస్ట్రీ లో సెట్లయ్యాము.. అలాగే నేచర్ సినిమా టైటిల్ బాగుంది. నేచర్ బాగుంటే మనందరం బాగుంటాము. నాకు ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట చూస్తుంటే నాకు ఇళయరాజా పాటలు గుర్తుకువస్తున్నాయి. యం. యల్ రాజా అద్భుతమైన మ్యూజిక్ చేశాడు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్స్ కూడా సాంగ్ లో చాలా బాగా నటించారు. కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుంది..నేచర్ టైటిల్ పెట్టి ఆ నేచర్ లో సినిమా చెయ్యడం అంటే ఆషామాసి కాదు. ఆ నేచర్ లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి.ఆ మధ్య మనం చూశాము. నేచర్ కొరకు వెళ్లిన కొందరు స్టూడెంట్స్ ఉన్న డ్యామ్ లొకి ఆకస్మాత్తు గా నీరు వచ్చి చాలా మంది చనిపోయారు. అందుకే పెద్దలు నీరు, నిప్పు, గాలి కి దూరంగా ఉండాలని చెపుతారు. అలాంటిది వీరు ఈ సినిమాను ఇక్కడే షూటింగ్ చేసుకోకుండా తలకోన వెళ్లి షూటింగ్ చేయడం చాలా గ్రేట్. అలాంటి ప్లేస్ లో ఎంతో హార్డ్ వర్క్ చేసిన టెక్నిషియన్స్ కు థాంక్స్ చెప్పాలి. హీరో కృష్ణ లాంటి ట్యాలెంట్ ఉన్న నటుడుకు సపోర్ట్ ఇస్తే నటుడుగా పైకి వస్తాడు అన్ని నమ్మి ప్రకృతి సంబందించిన మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న నిర్మాతలకు, దర్శకునికి ఈ సినిమా “రామ్ తేరా గంగా మైలీ ” అంతటి బిగ్ హిట్టు అవ్వాలి అన్నారు.

 

దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇద్దరు టీచర్స్ రాసిన కథే ఈ “నేచర్.”నిన్నే చూడందే”.లిరికల్ సాంగ్ చూస్తుంటే ఇందులో మ్యూజిక్, ట్యూన్,బ్యాక్ డ్రాప్ గానీ చాలా బాగుంది. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కు ఇది ఆరవ సినిమా.తను మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు. తను ఇంకా ఎన్నో సినిమాలలో నటించాలని కోరుకుంటున్నాను. యం. యల్ రాజా మ్యూజిక్ చాలా బాగుంది.నేచర్ వంటి మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రం దర్శక, నిర్మాతలకు మంచి పేరుతో పాటు సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker