సమతబట్టుపల్లిలో ఎంపీడీవో క్షేత్రస్థాయి పర్యటన
సబ్ సెంటర్, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల తనిఖీ.. నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచన
సమతబట్టుపల్లిలో ఎంపీడీవో క్షేత్రస్థాయి పర్యటన
సబ్ సెంటర్, అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలల తనిఖీ.. నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచన
కరకగూడెం, నవంబర్ 06, ప్రయత్నం న్యూస్:
కరకగూడెం మండలంలోని సమతబట్టుపల్లి గ్రామాన్ని శుక్రవారం ఎంపీడీవో సందర్శించి, గ్రామంలోని సబ్ సెంటర్, అంగన్‌వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో నిర్వహణ తీరును, పారిశుద్ధ్య పరిస్థితులను, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను సమగ్రంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పాఠశాలలో విద్యాబోధన నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధుల బారినపడిన వారికి సకాలంలో తగిన వైద్య సేవలు అందించాలని, గ్రామ ప్రజలకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీడీవో సూచించారు.





