తెలంగాణ
అమీన్పూర్ లో ఘనంగా వజ్రోత్సవాల వేడుకలు..

- వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ
- ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్ అందచేత

అమీన్పూర్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో గల ది నెస్ట్ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్ పేరు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 725 ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎమ్మార్వో విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




