హాలీవుడ్ చిత్రాలకి రికార్డింగ్ జరిగిన అబ్బే రోడ్ స్టూడియోస్ లో తేజ మార్ని ‘జోహార్’ చిత్ర మాస్టరింగ్ పనులు మొదలు!!

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ‘జోహార్’ నిర్మాణానంతర కార్యక్రమాలలో భాగంగా అవెంజర్స్, లార్డ్ అఫ్ ది రింగ్స్, హ్యారీ పాటర్ లాంటి హాలీవుడ్ చిత్రాల రీరికార్డింగ్ జరిగిన అబ్బే రోడ్ స్టూడియోస్ లో ఈ చిత్ర మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి.
భాను సందీప్ మార్ని నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రీ లుక్ మరియు క్యారెక్టర్ పోస్టర్లకు మంచి స్పందన లభించగా, పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ
‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్, ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ఇందులో ప్రధాన తారాగణం .
దర్శకుడు: తేజ మార్ని
నిర్మాత: భాను సందీప్ మార్ని
సంగీతం: ప్రియదర్శన్
సినిమాటోగ్రఫీ: జగదీశ్
పాటలు: చైతన్యప్రసాద్




