తెలంగాణముఖ్యాoశాలు
దాచుకున్న డబ్బులు… తీసుకున్న డబ్బులు మొత్తం పోయే

* పక్కా ప్లాన్ తో ప్రజలను మోసం చేసిన సాహితి
*లేని భూమిని ఉన్నట్టుగా చూపించి పచ్చి దగా….
*కంపెనీలు ఫేక్, ఈమెయిల్ ఫేక్, అడ్రస్ లు ఫేక్
సాహితీ ఇన్ఫ్రా పేరుతో బంజారాహిల్స్ లో ఒక ఆకర్షణీయమైన ప్లాట్ల అమ్మకాలు బ్రోచర్ల లో చూపించి ఉన్నపళంlగా ఎటువంటి రాయితీలు లేకుండా తక్కువ రేట్లో హైదరాబాదులో ప్లాట్ వస్తుందంటే అప్పు తెచ్చి లేదా లోన్ పెట్టి డబ్బులు కట్టేసి మూడున్నర సంవత్సరాల తర్వాత కొత్త ఇంటికి వెళతామని ఆశలతో ఉన్న దాదాపు 1700 మందికి పైగా బాధితులు ఇప్పుడు రోడ్డు ఎక్కారు ఒక ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసి, ఒక ఫేక్ ఈమెయిల్ ఐడి ఏర్పాటు చేసి కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించుకుంటూ బ్రోచర్లలో లేని భూమితో బొమ్మలు గీయించి రోడ్లు పార్కులు దేవాలయాలు ఆకర్షనీయమైన అంశాలను ప్రజలకు రుచి చూపించి వారిని అధోగతి పాలు చేసిన ఘనత సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది. ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆయన మరో నలుగురు వ్యక్తులు డైరెక్టర్లుగా కంపెనీలో చేరి వారి తెలివితేటలతో ప్రజలను మోసం చేసి ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితికి వచ్చారు వాస్తవానికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో 343 సర్వేనెంబర్ చాలా పెద్దది అయితే దీనికి సంబంధించి దాదాపు చాలా భూమిని మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించారని మరికొంత బంధం కొమ్ము అనే పేరిట అమ్మబడిందని సైనికులకు ట్రైనింగ్ సెంటర్ నిమిత్తం భూమి ఇవ్వబడిందని రికార్డులలో ఉంది సాహితీ వారు వారికున్న భూమి 23 ఎకరాలని 32 అంతస్తులతో పది టవర్లు నిర్మించి ఇస్తామని ప్రజలను పచ్చిదగా చేశారు. సర్వే నెంబర్ 343 బై 8,9,11,12,13 లలో భూమి ఉన్నట్టు ఆ సంస్థ ఎండి లక్ష్మీనారాయణ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. మూడు సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఇదే సమయంలో చాలామంది పెద్దపెద్ద అధికారులు చేత చెప్పించుకుని వారి దగ్గర నుండి చెక్కులు తీసుకొని వాటిని కూడా బౌన్స్ చేసుకున్నారు. అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుని వారి డబ్బు వారికి ఇవ్వడానికి మొదట సంస్థ యాజమాన్యం ఒప్పుకున్న ఆ తర్వాత ప్రజలకు ఏమాత్రం సమాధానం చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా ఉండడంతో సాహితీ బాధితుల పేరిట ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వారందరూ సాహితీ ఇన్ఫ్రా దగ్గర ఆందోళనకు దిగారు దీంతో సాహితీ గుట్టు రట్టు అయింది వారిచ్చిన ఆఫర్లు కేవలం బ్రోచర్ల మీదే ఆరు ఎకరాల నుండి 9 ఎకరాల మధ్యలో మాత్రమే ఉన్న వారి భూమికి జిహెచ్ఎంసి పర్మిషన్ ఇవ్వడానికి అనుమతిస్తుందా లేని భూమికి ఎలా అనుమతిస్తుంది అనేది వేచి చూడాల్సిందే




