“బొమ్మ బ్లాక్‌బస్టర్” చిత్రం బిగ్ హిట్ అవ్వాలి—-హీరో నాగ సౌర్య

పాజిటివ్ టైటిల్ తో వస్తున్న “బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి.. ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగ సౌర్య
విజయీభవ ఆర్ట్స్ పతాకం పై నందు విజయ్‌కృష్ణ హీరోగా.. యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడు గా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ సినిమాలోని పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో..ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హీరో నాగ సౌర్య, డి. జె. టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ,సెవెన్ హిల్స్ సతీష్, శ్రీని ఇన్ఫ్రా శ్రీను, సురేష్ కొండేటి, శేషాద్రి, నటులు సుడిగాలి సుధీర్, దనరాజ్, సత్యం రాజేష్, లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ముఖ్య అతిధిగా వచ్చిన హీరో నాగ సౌర్య మాట్లాడుతూ. మంచి కథతో తీసిన ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తుంది. థియేటర్స్ నుండి వచ్చిన ఆర్టిస్టులు అందరినీ ఈ సినిమాకు తీసుకువచ్చి వారికి అవకాశం కలిపించడం చాలా గ్రేట్, కెమెరామెన్ విజువల్స్ బాగున్నాయి హీరో, హీరోయిన్ లిద్దరూ చాలా బాగా నటించారు . రష్మీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి మంచి పేరున్న తను హీరో నందుకు సపోర్ట్ చేయడానికి ఈ సినిమాకు డబ్బులు తీసుకోకుండా ఆటోలో తిరిగింది అని విన్నాను. తనకు సినిమా పై ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నందు ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు.మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసిన, దర్శక,నిర్మాతలకు మరియి చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా టైటిల్ మాదిరే ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
డి. జె. టిల్లు డైరెక్టర్ విమల్, కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అని టైటిల్ లోనే సగం విజయం ఉంది . దర్శకుడు రాజ్ విరాట్ కు ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలి, నందు, రష్మి ఇంకా చాలా సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుతూ మంచి టైటిల్ తో వస్తున్న సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించాలిని అన్నారు.




