ఎర్రచీర లో తొలి తొలి ముద్దు రొమాంటిక్ గీతం

నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢమరి సమర్పణలోసి.హెచ్ సుమన్ బాబు స్వీయదర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం `ఎర్రచీర`. అమ్మ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలోని `తొలి తొలి ముద్దు.. ముద్దు పైన 150 ముద్దులు..` పాటను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. సినిమాలో వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ కు కె.సత్య సుమన్ బాబు లిరిక్ అందించగా అంజనా సౌమ్య- హేమచందర్ గాత్రమందించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ “కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నఈ సినిమా సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుం దన్నారు. చెప్పేందుకు కుటుంబ కథే అయినా.. హారర్ థ్రిల్లింగ్ అంశాల్ని, వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఈ చిత్రానికి ప్రధాన బలంప్రమోద్ స్వరాలు . రాజమండ్రి రైలెక్కి… శివ శివ శంభో శంకర పాటలకు ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. తాజాగా తొలి తొలి ముద్దు పాట శ్రోతల్లోకి అంతే వైరల్ గా దూసుకెళుతుందన్న నమ్మకం ఉంది. ఈ లిరిక్ యువతరాన్ని హత్తుకునే రొమాంటిక్ పదజాలంతో ఆకట్టుకుంటుంది. బాణీ అద్భుతంగా కుదిరిందని తెలిపారు.
ఈ చిత్రంలో మహానటి ఫేం బేబి సాయి తేజస్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజనా శెట్టి, కమల్ కామరాజు, శ్రీరామ్, భానుశ్రీ, అజయ్, ఉత్తేజ్, మహేష్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.




