ఈ నెల 28 ఆహా లో “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’.

*‘అందరూ బాగుండాలి.. అందులో ఆలీ కూడా ఉండాలి’ : డాక్టర్ బ్రాహ్మనందం
మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేసి తెరకెక్కించిన యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. అలీ సమర్పణలో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్, శ్రీ చరణ్ ఆర్. లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్, టీజర్‌ను ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, స్టార్ కామెడియన్ బ్రాహ్మానందం చేతుల మీదుగా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ చిత్ర ట్రైలర్, టీజర్ ను లాంచ్ చేశారు. వీరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..”అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన “వికృతి” సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్ నటులందరినీ తీసుకొని తీసిన ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం.మేము ఆలీతో తీసిన బ్లాక్ బస్టర్ యమలీల నెక్ట్స్ ఇయర్‌కు 30 సంవత్సరాలు అవుతుంది.అయినా ఆలీ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉన్నాడు. నటుడుగా వేయి చిత్రాలకు పైగా నటించిన ఆలీ ఈ చిత్రం ద్వారా సొంత బ్యానర్ పెట్టి సినిమా నిర్మించే స్థాయికి ఎదిగడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ… బాల నటుడుగా ఇండస్ట్రీకి వచ్చి అంచె లంచెలుగా ఎదిగి 1200 సినిమాలలో నటించడం గొప్ప విషయం. ఇలా ఇన్ని సినిమాలు చేసిన బ్రహ్మానందం కూడా ఈ వేదికపై ఉండడం విశేషం.ప్రేక్షకుల మనసుకు హత్తుకునే మంచి కథను సెలెక్ట్ చేసుకుని తన బ్యానర్ లో ఆలీ తెరకేక్కిస్తున్న ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” సినిమా పెద్ద విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.




