All

జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే సేవ్ చేశారు

- ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

జగన్‌ను ఓడించి విశాఖను ప్రజలే సేవ్ చేశారు

– ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు                                                                                                                            విశాఖ ప్రయత్నం న్యూస్

ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి విశాఖకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో గొడ్డలి పార్టీ నాయకులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే నేడు సేవ్ వైజాగ్ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారు. 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డిని, వైసీపీని ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేశారు. విశాఖ ప్రజలు 2014లో తన తల్లిని ఎంపీగా ఓడించారనే కక్షతో ఈ ప్రాంతంపై జగన్ వివక్ష చూపించారు. మేం గూగుల్ తీసుకొచ్చి ప్రోత్సహిస్తే… జగన్ రెడ్డి గంజాయి మాఫియాను ప్రోత్సహించారు. విశాఖ రైల్వే జోన్‌కు జగన్ అడ్డుపడితే… మేం అవసరమైన స్థలం కేటాయించి విశాఖ రైల్వే జోన్ సాధించాం. భోగాపురం విమానాశ్రయానికి కేటాయించిన 500 ఎకరాలను కాజేసేందుకు జగన్ కుట్ర చేశాడు. రుషికొండపై విలాసవంతమైన భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు చేసిన జగన్… విశాఖ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు రూపాయి ఖర్చు చేయలేదు. జగన్ హయాంలో విశాఖ వచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు పారిపోయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సాధించుకున్నాం. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేశాం. కూటమి ప్రభుత్వంలో విశాఖ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి అవుతుంటే… గొడ్డలి పార్టీ నాయకులు కుట్రలు చేస్తూ విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ 30 టీఎంసీల నీటిని ఉమ్మడి విశాఖ జిల్లాకు అందజేస్తున్నాం. గూగుల్ సంస్థపై, డేటా సెంటర్లపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు కొత్త భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత ఎన్నికల్లో మాదిరిగానా స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ఓటమి ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker