అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు
యాప్రాల్‌లోని అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే
అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు
యాప్రాల్, అక్టోబర్ 31:
వేడుకలను ఎంతో ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విద్యార్థుల నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మల పట్ల ప్రేమాభిమానాలను చాటుకుంటూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు, ఆటలు మరియు వినోద కార్యక్రమాలను ప్రదర్శించారు.
విద్యార్థులు, వారి తాతయ్యలు, అమ్మమ్మలు కలిసి నిర్వహించిన ఆటలు, సరదా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ తాతయ్యలు, నానమ్మలతో గడిపిన ఆనంద క్షణాలు వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
ఈ సందర్భంగా పెద్దల అనుభవాలు, ప్రేమ, ఆప్యాయతలు పిల్లల జీవితాలకు ఎంతో విలువైనవని తెలియజేశారు. తరతరాల మధ్య ప్రేమానుబంధాలను పెంపొందించడం, కుటుంబ విలువలను విద్యార్థులకు తెలియజేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ అనిల్ కాజా గారిని, శ్రీమతి అనురాధ గారిని, ప్రిన్సిపల్ చిత్ర బట్ గారిని , ఉపాధ్యాయులను తల్లిదండ్రులు మరియు పెద్దలు అభినందించారు. ఆనంద భరిత వాతావరణంలో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. విజయవంతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను తల్లిదండ్రులు మరియు పెద్దలు అభినందించారు. ఆనందభరిత వాతావరణంలో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి.




