మాదాపూర్ గచ్చిబౌలి పోలీసులకు బాధ్యత ఉందా……
సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగుల పేరుతో మోసాలు…. ఎన్ని కంప్లైంట్ లు పరిష్కరించారు
ఫిర్యాదు చేసి రెండు నెలలైనా కేసులు ఎఫ్ఐఆర్ చేయని వైనం….

డ్యూటీ చేస్తున్నారే గాని బాధ్యత లేదు అంటున్న ప్రజలు. ..?
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాదు లాంటి మహానగరంలో రెండే రెండు చోట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు చేస్తూ వారి జీవన ఉపాధిని సాగిస్తున్నారు ఉద్యోగాలు చేసేవారు కాకుండా కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారిని చాలామంది మోసం చేయడానికి పక్క ప్లాన్ వేసుకొని కొత్త కంపెనీల పేరుతో మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో వారి ఇష్టం వచ్చిన రీతిలో దోచుకుంటున్నారు పోలీసులు న్యాయం చేస్తారని నిరుద్యోగులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్న అధికారులు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నారే గాని ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదు మోసం చేసిన వాడితో పోలీసులు కుమ్మక్క అవుతున్నారా లేక ఎక్కువ బాధ్యతలతో పడి మర్చిపోతున్నారా అయినా మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరుద్యోగులు రోజు పోలీస్ స్టేషన్లో చుట్టే తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు ఎవరో ఒక వ్యక్తి కంపెనీలో ఉద్యోగం ఇస్తారండి ఒక కంపెనీని పెట్టుకొని ఆ కంపెనీని ఇచ్చి టెస్టులు రాపించి ఒరిజినల్ గా ఏ కంపెనీలు అయితే పనులు మాట్లాడతాయో ప్యాకేజీలు మాట్లాడతాయో అలానే ప్రవర్తించి తీరా ఉద్యోగం ఇచ్చే సమయానికి రెండు లక్షలు మూడు లక్షలు డిమాండ్ చేస్తూ నిరుద్యోగులను టార్చర్ పెడుతున్నారు రెండు లక్షల మూడు లక్షల పోయిన సంవత్సరానికి 6 లక్షలు ఏడు లక్షలు ప్యాకేజీ ఇస్తాము అని ఆశ పెడుతున్నారు ఆశ నెరవేరకుండానే సదరు కంపెనీలో పెట్టిన యజమానులు బోర్డు తిప్పేసి కంపెనీలు మూసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి తెలియకుండా బెంగళూరు చెన్నై ముంబై మరో రాష్ట్రం వెళ్లి అక్కడ కొత్త అవతార వ్యక్తి ఆ అవతారం వల్ల ముగించుకుని తిరిగి మల్ల హైదరాబాద్ వచ్చి రాయదుర్గం గచ్చిబౌలి మాదాపూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట కొత్తగా మరో అవుతారు వ్యక్తి ఇటువంటి పని లేక నిరాశతో ఉన్న ఒక వృద్ధ ఇంజనీర్ ను తీసుకొని ఆయన ద్వారా ఇంటర్వ్యూ చేయించి ఆ ఇంటర్వ్యూలు ఎంతమంది వచ్చారో చూసుకొని వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్గా పెట్టుకొని డబ్బులు రాగానే కంపెనీలు ఎత్తేస్తున్నారు మరి వీళ్ళ మీద కంప్లైంట్ లు చేసిన నిరుద్యోగులు పోలీసులు మాకు న్యాయం చేస్తారని వారు తమ ఊర్లకు వెళ్లిపోయి అక్కడ తల్లిదండ్రులను హోదా ఇచ్చే సమయం పెట్టుకుని రెండు మూడు నెలల తర్వాత వస్తే మీరు ఎవరు ఎందుకు వచ్చారు మా స్టేషన్లో మీకేం పని కంప్లైంట్ ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు ఎట్లా ఇచ్చారు ఎవరికిచ్చారు రిజిస్టర్ అయిందా లేదా అనే ప్రశ్నలు ఎదురు వేస్తూ పోలీస్ అధికారులు కాలక్షేపం చేస్తున్నారు ప్రజలతో మమేకమై అన్ని పనులు చేస్తున్నామన్నారు కానీ నిరుద్యోగులను వదిలేసారా



