All

నరకాన్ని తలపిస్తున్న బస్తీ వాసుల బతుకులు… స్పందించని అధికారులు!

స్థానిక సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన

నరకాన్ని తలపిస్తున్న బస్తీ వాసుల బతుకులు… స్పందించని అధికారులు!
​- స్థానిక సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన                                                         

హైదరాబాద్ ప్రయత్నం న్యూస్

​రామ్ గోపాల్ పేట P. G రోడ్ నుండి నల్లగుట్ట కు వెళ్లే బస్తీలో మార్వాడి విద్యాలయం ఎదురుగా వెస్లీ స్కూల్ కాంపౌండ్ గేట్ ఆనుకుని ఉన్న బస్తీ ప్రజలు గత మూడు నెలలుగా అ নরకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన ప్రజాసమస్యలను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారు స్వయంగా ఆ బస్తీలో పర్యటించారు. స్థానిక ప్రజలతో కలిసి మోకాళ్ల లోతు నీళ్లలో నడుస్తూ వారి గోడును స్వయంగా ఆలకించారు.
​ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు:
​డ్రైనేజీ, మంచినీటి కాలుష్యం: గత మూడు నెలలుగా డ్రైనేజీ నీరు నేరుగా ప్రజల ఇళ్లలోకి ప్రవహిస్తోంది. అంతేకాకుండా, మంచినీటి నల్లాల్లో డ్రైనేజీ నీరు కలిసి కలుషితమై వస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
​అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యం – వ్యాధుల బారిన ప్రజలు: గత మూడు నెలలుగా ఈ బస్తీలో పారిశుద్ధ్య కార్మికులు కనీసం ఊడుపు కూడా చేయలేదు. ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుండటంతో, ప్రజలు డెంగ్యూ బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎవరి ఇళ్లల్లో చూసినా ఆరోగ్య పరిస్థితులు అత్యంత క్షీణించి ఉన్నాయి.
​విద్యార్థులు, బాలికల ఇబ్బందులు: రోడ్లన్నీ మురుగునీటితో నిండిపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్న పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు స్కూల్ నుంచి బయటకు రావడానికి, బడికి వెళ్లడానికి కాళ్లు పెట్టే పరిస్థితి కూడా లేక బురదలోనే ఇళ్లకు చేరుకుంటున్నారు.
​ట్రాఫిక్ ఇబ్బందులు – కార్ల పార్కింగ్ సమస్య: రోడ్ల మధ్యలో ఇష్టానుసారంగా కార్లను పార్క్ చేస్తుండటంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. డ్రైనేజీ చెత్తాచెదారంతో నిండిపోయి రోడ్లు కుచించుకుపోతే, ఈ కార్ల పార్కింగ్ స్థానికులకు మరింత శాపంగా మారింది.
​వీధిదీపాలు లేక అంధకారం: రాత్రి వేళల్లో అసలు స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.
​అధికారుల నిర్లక్ష్యంపై హెచ్చరిక:
​ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల్లో స్పందన లేదని స్థానికులు వాపోయారు. ఈ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారు మాట్లాడుతూ… “అధికారులు ప్రజల సంక్షేమం కోసమే ఉన్నారు కానీ నిర్లక్ష్యం చేయడానికి కాదు. ప్రతి అధికారికి ఈ సమస్యపై వినతిపత్రం సమర్పించబోతున్నాం. రానున్న వారం రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే, స్థానిక ప్రజలతో కలిసి అక్కడే నిరాహార దీక్షకు దిగుతాం” అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker