All

ఓ యువకుడు మాదాపూర్‌ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య

కోనసీమకు చెందిన ఎ.సాయి మహేశ్వర్‌ 26 ఆత్మహత్య

ఉద్యోగ సమస్యలతో ఆర్థిక ఆరోగ్య సమస్యలతోఇబ్బంది పడుతున్న ఓ యువకుడు మాదాపూర్‌ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు కథనం ప్రకారం.. కోనసీమకు చెందిన ఎ.సాయి మహేశ్వర్‌ 28 సంవత్సరాలు నల్లగండ్లలో ఉంటూ వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో దుర్గం చెరువుకు వచ్చారు. తీగల వంతెన వద్ద ఫొటోలు తీసుకుని చెరువు వద్ద దిగిన ఫొటోల్లో దిగులుగా, అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే ఆయన స్నేహితులు అక్కడకు చేరుకున్నారు. వంతెన వద్ద చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా.. చెరువులో దూకినట్లు తేలింది. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయేమో తెలియదు గాని చనిపోవడానికి తెగబడ్డ అతడు నిర్ణయం ఒక రోజు ముందే తీసేసుకున్నట్టుగా తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker