All

డీఎస్సీ నోటిఫికేషన్ నేడు 2,721 పోస్టులకు ప్రకటన విడుదల కానుంది

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్

ఈరోజే
అమరావతి ప్రయత్నం న్యూస్
ఉపాధ్యాయుల పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్ నేడు విడుదల చేస్తారని ప్రభుత్వం పదేపదే చెప్పుకుంటూ వస్తుంది: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేయనుంది. పోస్టుల రిజర్వేషన్‌ రోస్టర్‌కు సంబంధించి జిల్లా విద్యాధికారులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. అక్టోబరు 13న డీఎస్సీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. నవంబరు 3 లోపు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఆ ప్రకటనలోనే పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణ పదో తేదీ నుంచి చేపట్టే అవకాశం ఉంది. మొత్తం 2,721 పోస్టులకు ప్రకటన విడుదల కానుంది. ఇందులో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో 2,111, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు 350, సొసైటీల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ పోస్టులు 260 ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker