All

రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు కోర్టు శిక్ష ఎందుకు విధించింది ఎవరికైనా తెలుసా……

కోర్టు ధిక్కరణ చేసిన ఐఏఎస్ డ్యూటీకి పనికొస్తాడా.....? రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేదు.....?

రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు కోర్టు శిక్ష ఎందుకు విధించింది ఎవరికైనా తెలుసా……

హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఎందుకు శిక్ష పడింది ఏ కేసు మీద ఆయనకు శిక్ష కోర్టు వేసింది ఆయన ఏం చేశారని ఆశిక్షకు అర్హుడయ్యాడు మరి శిక్ష ఆపుకోవడానికి నాలుగు వారాలు గడువు ఇచ్చిన కోర్టు ఆ శిక్షలో ఉన్న పూర్తి విషయాలను వెల్లడించింది విషయం ఒకసారి పరిశీలిస్తే అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజల్ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంట ప్రాంతంలో ఉన్న ప్లాట్ నంబర్ 59 మరియు ప్లాట్ నంబర్ 62 (తూర్పు భాగం)లకు సంబంధించిన కేసు ఇది పిటిషనర్లు. పి. శివలీల, ఆమె భర్త పి. వెంకటేశ్వర్లు తమ ఓపెన్ ప్లాట్లకు నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని కోరారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద ఉన్న నిషేధిత ఆస్తుల జాబితా నుంచి వాటిని తొలగించాలని వారు దరఖాస్తు చేసుకున్నారు. 2022 ఆగస్టులో అప్పటి కలెక్టర్ ఇదే లేఅవుట్‌లోని పక్క ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ఆధారంగా తమ ప్లాట్లను కూడా తొలగించాలని దంపతులు 2024 మార్చిలో దరఖాస్తు చేసుకున్నారు 2025 ఆగస్టు 5న హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించింది. దంపతుల విజ్ఞప్తిని పరిశీలించి 60 రోజుల్లోగా తగిన కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు దారితీసిన పరిణామాలు * గడువు ఉల్లంఘన. హైకోర్టు ఇచ్చిన 60 రోజుల గడువులోగా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తీర్పుపై అప్పీల్ కూడా చేయలేదు. * ధిక్కరణ పిటిషన్. గడువు ముగియడంతో 2025 అక్టోబర్ 15న బాధితులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
* ఆలస్యంగా తిరస్కరణ. కోర్టు ధిక్కరణ నోటీసులు అందిన తర్వాతే, 2026 ఫిబ్రవరి 26న మరియు జూలై 8న కలెక్టర్ దంపతుల అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒకే లేఅవుట్‌లోని ఇతర ప్లాట్లకు అనుమతి ఇచ్చి, వీరి పట్ల భిన్నంగా వ్యవహరించడంపై జస్టిస్ కె. లక్ష్మణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు
కోర్టు ఆదేశాలు సరైనవైనా, కాకపోయినా వాటిని అమలు చేయాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అభ్యంతరం ఉంటే పైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి తప్ప నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker