పాకిస్తాన్‌తో U19 ఆసియా కప్ ఫైనల్….భారత్ కి అద్భుతమైన విజయం
నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతి వరకు గుండెలు ఆగిపోయే థ్రిల్లర్!
నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతి వరకు గుండెలు ఆగిపోయే థ్రిల్లర్!
కొట్టాల్సిన టార్గెట్.. 338
భారత్ 41.3 ఓవర్లకి 252/8… ఇక భారత్ గెలుస్తుందని ఎవరు అనుకుంటారు? కానీ అక్కడి నుంచే అసలు సినిమా మొదలైంది!
పాకిస్తాన్‌తో U19 ఆసియా కప్ ఫైనల్.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు 338 పరుగుల కొండంత లక్ష్యం!
ఛేదనలో భారత జట్టు ఒక దశలో బాగానే కనిపించినా.. కీలక వికెట్లు వరుసగా పడటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కెప్టెన్ లక్ష్య రైచందాని 70 పరుగులతో పోరాడినా, 38 ఓవర్లకే 226 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అనవసర ఒత్తిడి.. వరుస వికెట్లు!
41.3 ఓవర్లకు 252/8!
ఇంకా 51 బంతుల్లో 86 పరుగులు చేయాలి. చేతిలో రెండు వికెట్లు మాత్రమే! కావాల్సిన రన్‌రేట్ పదికి పైగా!
ఇక మ్యాచ్ పోయిందని చాలామంది టీవీలు ఆపేసి ఉంటారు.. ఛానెల్స్ మార్చేసి ఉంటారు. పాకిస్తాన్ శిబిరంలో విజయోత్సాహం మొదలై ఉంటుంది. కానీ భారత జెర్సీలో ఉన్న ఆ ఇద్దరు కుర్రాళ్లు మాత్రం ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేరు!
మణాల్ చౌహాన్, మోహిత్ ఉల్వా.. అక్కడి నుంచి పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టారు. బౌండరీలు, సిక్సర్లతో అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని కళ్లముందుకు తీసుకొచ్చారు. 47 పరుగులతో మణాల్, 30 పరుగులతో మోహిత్ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు.
చివరి దశలో మళ్లీ వికెట్ పడింది. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి వికెట్ దగ్గరపడుతున్నా.. భారత యువకిశోరులు వెనక్కి తగ్గలేదు!
చివరి బాల్ కి మూడు రన్స్ అవసరం కాగా
మోహిత్ ఉల్క్వ ఫోర్ కొట్టి భారత్ కి అద్భుతమైన విజయం అందించారు
మన తెలుగు బిడ్డ చిగురుపాటి వెంకట.. బౌలింగ్‌లో మూడు వికెట్లు, బ్యాటింగ్‌లో కీలక సమయంలో వికెట్ కాపాడుకుంటూ అండగా నిలిచి భారత విజయంలో అద్భుతమైన పాత్ర పోషించాడు.
ఇది కేవలం గెలుపు కాదు.. చివరి నిమిషం వరకు పోరాడితే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని నిరూపించిన విజయం!
టీవీలు ఆపేసిన చోట.. భారత కుర్రాళ్లు విజయానికి తెరలేపారు! చిల్డ్రన్ దినోత్సవం నాడు అద్భుతమైన విజయాన్ని అందించిన మన యువ కిశోరాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.




