పిల్లలు ఇలా కూడా ఉంటారా….. దారుణమైన హత్య చేసిన యువకుడు

అత్యంత కిరాతకంగా హత్య చేసిన బాలుడు…. వయసు 17
హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
తెలిసి తెలియని వయసులో కక్షలు పెంచుకొని ఎప్పుడో జరిగినదాన్ని నెమరి వేసుకుంటూ అతను కోసం చూసిన ఒక యువకుడు దారుణమైన హత్య చేశాడు వివరాల్లోకెళ్తే మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదంతో పాటు తనను, తన తల్లిని దూషించాడన్న కోపంతో ఓ బాలుడు అతడితోపాటు పనిచేస్తున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు సోమవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సీఐ పి.కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలుడు(17) జీవనోపాధి కోసం ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్‌కు వచ్చి జగత్ స్వప్న స్పార్కిల్ క్యాసిల్‌లో బంధువు శివతో కలిసి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఒకటే గదిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే శివ బాలుడిని, అతడి తల్లిని దూషించడంతో కక్ష పెంచుకున్నాడు. ఆదివారం ఇద్దరూ కలిసి మద్యం తాగుతున్న సమయంలో మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన బాలుడు యువకుడిని కిందపడేసి సిమెంట్ ఇటుకతో ముఖం, తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో మర్మాంగాన్ని కోశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సోమవారం అవుషాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.




