: చైనా పౌడర్‌తో బంగారం కల్తీ

బంగారు ఆభరణాల్లో ‘రేనియం’ అనే చైనా పౌడర్ కలిపి కల్తీ చేస్తున్న కొత్త మోసాన్ని ‘దైనిక్ భాస్కర్’ అనే వార్తాసంస్థ వెలుగులోకి తెచ్చింది. తక్కువ ధరకు లభించే ఈ పౌడర్ ముంబై, అహ్మదాబాద్, జైపూర్ లాంటి నగరాల్లో వాడుతున్నారని పేర్కొంది. అది కలిపితే గోల్డ్ ప్యూరిటీ తగ్గి బరువు పెరుగుతోందని, అయినా XRF యంత్రాలు, హాల్‌మార్క్ సెంటర్లు గుర్తించలేక పోతున్నాయనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.



