
ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగను మెగాస్టార్ చిరంజీవి ఇంట సంక్రాంతి సంబరాలు జరిగాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఫోటోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోపోస్ట్ చేసారు.
హ్యాపీ సంక్రాంతి అంటూ రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ తదితరులను ఆ ఫొటోలో ఉన్నారు.



