
‘కాంచన’ తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడం, ఆ సినిమాలో నాకు మంచి పేరు రావడం వల్లే.. ఈ సినిమా వచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌కి కూడా నేను బాగా సెట్ అవుతున్నానని డైరెక్టర్‌గారు ఫీల్ అయ్యారు.
బాలకృష్ణతో కలిసి నటించారు. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ?
తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన లెంజెండ్, రియల్ లైఫ్‌లో కూడా రూలర్ లాంటి ఆయనతో కలిసి నటించడం చాల హ్యాపీగా అనిపించింది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నటన పట్ల ఆయనకున్న అంకితభావం అమేజింగ్. కొన్ని సీన్స్ చేయలేనప్పుడు కోస్టార్స్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తారు. అంత పెద్ద స్టార్ ఆయి ఉండి కూడా చాల సింపుల్‌గా ఉంటారు, అందర్నీ ఒకేలా చూస్తారు. ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు అందరికి సాయం చేసే పెద్ద మనసు ఆయనది.
రూలర్‌లో మీ పాత్ర గురించి ?
నా క్యారెక్టర్‌లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ట్రేడిషనల్‌గా కనిపిస్తాను, అలాగే గ్లామర్ గర్ల్ నటించాను. అదేవిధంగా నా క్యారెక్టర్‌లో సీరియస్ యాంగిల్ కూడా ఉంటుంది. నటనకు చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. ఇందులో నాపై రెండు సాంగ్స్ ఉంటాయి. ఒకటి సంక్రాంతి సాంగ్, మరొకటి మెలోడీ సాంగ్.
మీ తదుపరి సినిమాలు గురించి ?
తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం తమిళ్ మళయాలంలో కూడా మూవీస్ చేస్తున్నాను.



