Allమూవీ రివ్యూసినిమాలు

రామ్‌చరణ్ విడుదల చేసిన మత్తు వదలరా టీజర్



ప్రముఖ సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండ‌గా మ‌రింద‌రు టాలెంటెడ్ టీమ్ తో వ‌స్తున్నచిత్రం మత్తు వదలరా. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  విభిన్న‌కథ, కథనాలతో రాబోతున్నఈ సినిమాతో కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రితేష్ దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్నారు. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలుగా ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూమీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ఇప్ప‌టికే విడుదల చేసిన విష‌యం తెలిసిందే.


తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేయ‌టం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాల‌ను నిర్మాతలు మీడియాకు వివ‌రిస్తూ, యువ‌త‌రంలో ఉన్న కొత్త టాలెంట్‌ను ప్రోత్సాహించాలనే వుద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో పాటు హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారని చెప్పారు.. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker