తెలంగాణముఖ్యాoశాలు

మేయర్ అధికారులకు అండగా నిలుస్తున్నారా?

జిహెచ్ఎంసి అధికారుల పనితీరు జేబులు నింపుకోవటం కోసమే……..
మేయర్ అధికారులకు అండగా నిలుస్తున్నారా?
 జిహెచ్ఎంసి పరిధిలో జరిగే అన్ని వర్కుల్లో పెద్దవాళ్ల హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారు వేల కోట్ల పనులు వాటి పరిశీలన అంతంతమాత్రంగానే జరుగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న 2000 పార్కుల్లో 86 లైబ్రరీలు ఉన్నాయి. ఈ లైబ్రరీలు పనిచేస్తున్నాయా మింగేసారా పార్కుల్ని మింగేసినవారు లైబ్రరీలు ఒక లెక్క 2021 – 22 సంవత్సరానికి గాను జిహెచ్ఎంసి పార్కులకు లైబ్రరీలకి ఎంత డబ్బులు కేటాయించింది. పూర్తిగా అవినీతిలో కూలిపోయిన అధికారులు చేసేది లేక చెప్పేది లేక లో లోపల మదన పడుతున్నారు. అధికారులు తీసుకునే ప్రతి రూపాయిలో సగం పైనే కార్పొరేటర్లకు రాజకీయ నాయకులకు ముట్ట చెబుతారు వీటిని తిరిగి తీసుకునే పద్ధతి లేదు కాబట్టి జిహెచ్ఎంసిలో పెద్దవాళ్ల హస్తంతోనే అధికారులు జేబులు నింపుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది గత మేయర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు వాటి వెనక మాజీ మేయర్ పిఏ హస్తము ఏమైనా ఉందా ఉంటే ఎంతవరకి, ఉద్యోగంలో చేరేటప్పుడు ఒక విధంగాను చేరను తర్వాత కోట్ల రూపాయలు ఆస్తులు కనపడతాయి ఎట్లా వచ్చాయి ఎవరిచ్చారు అనే అంశాలు మాత్రం ఎవరు అడగకూడదు ఎవరు చెప్పరు కూడా జిహెచ్ఎంసి పరిధిలో 1000 పార్కులు మాయమయ్యాయేమో నన్న అనుమానాలు బాగా వస్తున్నాయి 1000 పార్కులు అంటే ఎన్ని ఎకరాలు అది కూడా హైదరాబాద్ సిటీ లో ఈ అవినీతిలో పాత్రధారులు ఎవరు. కార్పొరేటర్ల, మేయరా లేక మంత్రుల అధికార పార్టీ ఎమ్మెల్యేల ఎవరున్నారు లేకుంటే అధికారులే మింగేసారా ప్రస్తుత జిహెచ్ఎంసి మేయర్ వీటి పైన పూర్తి గా విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటకు వస్తాయి విచారణ జరిపించే ధైర్యం ఉందా ఎందుకంటే మీ దగ్గర ఉండే పీఏలే పెత్తనాలు సెలవిస్తున్నారు అనేది మీ అధికారులు చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker