నల్లగుట్ట బస్తీ ప్రజల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు
వాటర్ బోర్డ్ ఎండీని కోరిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
నల్లగుట్ట బస్తీ ప్రజల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు వాటర్ బోర్డ్ ఎండీని కోరిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్:
రామ్‌గోపాల్ పేట్, పి.జి
. రోడ్ నుండి నల్లగుట్టకు వెళ్లే మార్గంలో (మార్వాడి విద్యాలయం ఎదురుగా, వెస్లీ స్కూల్ కాంపౌండ్ గేట్ ఆనుకుని ఉన్న) బస్తీ ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కాట్రగడ్డ ప్రసూన గారు ఈరోజు వాటర్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) శ్రీ అశోక్ గారిని అధికారికంగా కలిశారు.
ఈ సందర్భంగా బస్తీ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన డ్రైనేజీ సమస్యలను, దానివల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్న విషయాన్ని ఎండీ శ్రీ అశోక్ గారి దృష్టికి ప్రసూన గారు సవివరంగా తీసుకెళ్లారు.
దీనిపై వాటర్ బోర్డ్ ఎండీ శ్రీ అశోక్ గారు అత్యంత సానుకూలంగా స్పందించారు. “ప్రజల కోసం మేము ఉన్నాము, ప్రజల అవసరాలు తీర్చడానికే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు, దీనిపై ఇమ్మీడియట్‌గా తక్షణ చర్యలు తీసుకుంటాం” అని ఆయన హామీ ఇస్తూ అధికారులను అప్రమత్తం చేశారు.
బస్తీ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్య పరిష్కారానికి తక్షణమే స్పందించిన వాటర్ బోర్డ్ ఎండీ శ్రీ అశోక్ గారికి మరియు బస్తీ ప్రజల కష్టాలు తీర్చడానికి నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారికి స్థానికులు, బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

