పాపం బిడ్డ…ఎలా తల్లడిల్లుతోంది…
తల్లిదండ్రులు కూడా ఎంత హృదయ రోదనతో కుమిలిపోతున్నారు…
దయ చూపాలి న్యాయం..!
……..
“నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది”
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అప్పగించని అధికారులు
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన
చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించిన అధికారులు
ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా, “నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది” అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు



