గత తప్పిదాలు అక్రమాల వల్లే మా పార్టీకి పరిస్థితి…..

కూటమి దే పని చేయగా ఉంది…..
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పట్లో అధికారం ఉందని మా పార్టీ చేసిన తప్పిదాలు అక్రమాల వల్లే ఆ పార్టీకి ఇటువంటి ఇబ్బంది వచ్చి పడిందని అంబటి రాంబాబు చెప్పుకొస్తున్నారు ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోయామని వైకాపా నేత అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూనే తాము దారుణంగా ఓడిపోవడం నిజమని చెప్పారు. మద్యం రవాణా కేసులో బుధవారం హైదరాబాద్లో ఈడీ విచారణ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం పాలైందని, కూటమి అక్రమాల వల్లే ఇలా అయిందన్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు కదా అని విలేకర్లు అడగ్గా… అందుకే ఇప్పుడు తమకు ఈ గతి పట్టిందని రాంబాబు అన్నారు. ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.ఈడీ అధికారులకు అన్ని విషయాలూ అంతకు ముందు ఈడీ విచారణ గురించి చెబుతూ నియోజకవర్గ వైకాపా నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తంలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టుల కోసం సిఫారసు చేశానని, ఈ విషయమై వాసుదేవరెడ్డితో మాట్లాడానని రాంబాబు చెప్పారు. దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. తాను సిఫారసు చేసిన వారికి కాంట్రాక్టులు దక్కాయని, వాటిని ఐదేళ్లపాటు నిర్వహిస్తే రూ.15కోట్ల నుంచి రూ.17 కోట్ల టర్నోవర్ నమోదైందని, అందులో కుంభకోణం జరిగిందంటూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఈ క్రమంలోనే తాను విచారణకు హాజరైనట్లు రాంబాబు వివరించారు




