సివిల్ వివాదాల్లో తల దూర్చి పోలీసులు సెటిల్ చేస్తున్నారు

సివి ల్ వివాదాల్లో తల దూర్చి పోలీసులు సెటిల్ చేస్తున్నారు
చదువుకున్నారు సంస్కారం ఉన్నవాళ్లు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు ….. అరే, ఏరా, ఏందిరా, పోరా, అని భాష వాడడం చాలా ప్రమాదకరం
గతంలో ప్రకాశంజిల్లాలో చిన్నగంజాం పేరు ఉండేది, చిన్నగంజాం ఇప్పుడు బాపట్ల జిల్లాలో చేరింది .ఎక్కడ చేరిన ఎంత బాధపడిన పేద ప్రజలకు మాత్రం ఒక వైపు పోలీసుల నుంచి మరోవైపు రాజకీయ నాయకుల నుండి ఇబ్బందులు తప్పడం లేదు. అన్నీ మావే, అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తాం, అని అన్నట్టుగా ఒక హుందాను చూపించాల్సిన పోలీసులు, సివిల్ మేటర్ లో తలదూర్చి ప్రజలను ఇబ్బందిలో పాలు చేస్తున్నారు. జిల్లాలో పోలీసులు రెచ్చిపోతున్నారు. సివిల్ వివాదాల్లో తల దూర్చి సెటిల్ చేస్తున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లలో సివిల్ దందాల జోరు కొనసాగుతోంది. ఇటీవల సివిల్ వివాదాలు, సెటిల్మెంట్‌లతోపాటు భూములు కబ్జా చేయడం పరిపాటైంది. ఇదేవిధంగా పలువురు పోలీసుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. వివాదాల్లో ఉన్న భూములను చక్కబెట్టేస్తున్నారు. వృద్ధులు, ఎన్‌ఆర్‌ఐలు, రిటైర్డ్ ఉద్యోగులు కొనుగోలు చేసిన భూముల వద్దకు తరచూ రాకపోవడాన్ని అవకాశంగా మార్చుకుని కబ్జా చేయడంతోపాటు వాటిల్లో ఆగమేఘాలపై నిర్మాణాలు చేపడుతున్నారు.బాధితులు వచ్చి చూసుకుని లబోదిబోమంటూ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు ఉండటం లేదు. అక్రమాలకు పాల్పడిన వారే స్టేషన్లలో చక్రం తప్పుతూ బాధితులను వేధిస్తున్నారు. ఇక ఏం చేయలేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఉన్నతాధికారి దృష్టికి కూడా ఆ కేసులు పోకుండా వ్యవహారాలు చేస్తున్నారు. అలాగే అధికారపార్టీ నాయకుల అక్రమాలకు కూడా బహిరంగంగానే సహకరిస్తున్నారు. వారందించే నజరానాలకు తలొగ్గి భూవ్యవహారాల్లో అమాయకులను బెదిరించడం పరిపాటిగా మారింది. అలాగే జిల్లాలోని పలు స్టేషన్లలో సివిల్ దందాలు ఎక్కువయ్యాయి. అన్నీ మావే అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తాం అని అన్నట్టుగా ఒక హోదాను చూపించాల్సిన పోలీసులు సివిల్ మేటర్ లో తలదూర్చి ప్రజలను ఇబ్బందిలో పాలు చేస్తున్నారు




