వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం ఆడియో విడుదల

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని అరాచకాన్ని సునిశిత హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకి చదలవాడ శ్రీనివాసరావు, అజయ్ కుమార్, ఏం ఏం శ్రీలేఖ, జయచంద్ర రెడ్డి, ఎస్ వి రావు, సుభాష్ చక్రవర్తి రవడ, భార్గవ్, నిఖిలేష్ భరద్వాజ తదితరులు పాల్గున్నారు.
ఈ చిత్ర ఆడియోని శ్రీ బాలాజీ మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి మాట్లాడుతూ “వెల్కమ్ తో తీహార్ కాలేజీ చాలా గొప్ప సినిమా. పాటలు చాలా బాగా వచ్చాయి. కథకి కథనానికి అనుగుణంగా ఉంటాయి. సునీల్ గారితో జర్నీ చాలా గొప్పగా ఉంది. సినిమా చాలా గొప్పగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది” అని కోరుకున్నారు.
నిర్మాత ఎక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ “ఈ చిత్రం నేటి యువతకి బాగా నచ్చుతుంది మరియు తల్లిదండ్రులకు కూడా బాగా నచ్చుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.



