‘థర్టీ ఫెలో’ మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు

థర్టీ ఫెలో మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు
రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2019 శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా, ఆడారి మూర్తి సాయి డైరెక్షన్ లో, జీ ఎస్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి థర్టీ ఫెలో అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు వీర శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్, హిరో శాంతి చంద్ర, హీరోయిన్ శిమ్రితీ బతీజా, చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి , నటుడు కుమరన్ తదితరులు పాల్గొన్నారు
డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ; మోషన్ పోస్టర్ బాగుంది .టైటిల్ విషయంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేసి జనాలకు రిచ్ అయ్యేలా వుండాలి..ఆ విధంగా ఈ దర్టి ఫెలో టైటిల్ ఈ కథ కీ యాప్ట్. హీరో శాంతి చంద్ర కొన్ని సినిమాల లో నటించారు. ఫైర్ వున్న నటుడు. సినిమా పట్ల ఫ్యాషన్ తో ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు..ఈ సినిమా లో తన లుక్ సుపర్బ్. దర్శకుడు మూర్తి సాయి గారు తన పంథా మార్చుకొని డాన్ సినిమాని తెరకెక్కించారని అనుకుంటున్నాను. మోహన్ రావు కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మరిన్ని సినిమాలు చెయ్యాలి అన్నారు
హిరో శాంతి చంద్ర మాట్లాడుతూ; ఈ మూవీ స్టార్ చేయడానికి ముఖ్య కారకుడు దర్శకుడు మోహన్..అతను వచ్చి ఈ సినిమా గురించి చెప్పాడు. 2010 నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వున్నాను..దర్శకుడు మూర్తి సాయి, కెమెరా మెన్ రామకృష్ణ ఇద్దరు వర్క్ చూసి వీళ్ళు కదా నాకు కావాలి అనుకొని సినిమా పట్ల ప్రేమ పెరిగింది. అలాగే డాక్టర్ సతీష్ గారు సహకారం మరువలేను.. అరకు, వైజాగ్, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ చేసాము. మాకు బలమైన నమ్మకం ఈ సినిమా కథ..ఒక తండ్రి తనకొడుకునీ సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే… ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి…తండ్రి కొడుకుల మధ్య జరిగే యాక్షన్ డ్రామా. ఇ హీరోయిన్స్ ఇద్దరు బాగా నటించారు. ఈ సినిమా లో నటించిన నటి నటులు టెక్నిషియన్స్ కు ధన్యవాదములు అని అన్నారు.
చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ: ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా కథలో వున్నాయి. హీరో శాంతి చంద్ర డాక్టర్ సతీష్ గారు సహకారం మరువలేను.మేము పిలవగానే మా ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు వీర శంకర్ గారు, నక్కిన త్రినాథ్ రావు గారు కు థాంక్స్ అన్నారు



