All
60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి విముక్తి..*
మియాపూర్ సర్వే నంబర్లు 100, 101 భూ వివాదంలో ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయం..
*మియాపూర్ సర్వే నంబర్లు 100, 101 భూ వివాదంలో ప్రభుత్వానికి చారిత్రాత్మక విజయం..
సుప్రీంకోర్టులో ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లు కొట్టివేత.. 60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి విముక్తి..*
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవనీయ సుప్రీంకోర్టులో చారిత్రాత్మక విజయం లభించింది. సుమారు 550 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ భూములకు సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను గౌరవనీయ సుప్రీంకోర్టు 29.10.2026న కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . *జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గార్లతో* కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.




