All
పోలింగ్‌కు ముందే రాళ్ల దాడి.. పులివెందులలో హల్ చల్
AP: కడప జిల్లా పులివెందులలో పోలింగ్ ప్రారంభానికి ముందే హింస చెలరేగింది. తెల్లవారుజామునే కొందరు అల్లరి మూకలు హల్ చల్ చేశారు. సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద మాస్కులు ధరించి కర్రలతో రోడ్డుపై తిరిగారు. మరికొందరు రాళ్లు విసిరారు. ఏజెంట్లు పోలింగ్ కేంద్రం లోపలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇలా చేసినట్లు సమాచారం.



