రాష్ట్రంరూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉండడం బాధాకరమన్నారు.
ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు
లో రెండు ప్రధాన పార్టీలకు దీటుగా మూడో ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 11న విజయవాడలో పార్టీ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు ఒ.వి.రమణతో కలిసి విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి సోమవారం మాట్లాడారు. విజయవాడ వేదికగా ఈ నెల 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశామన్నారు. తమ పార్టీలో చేరేందుకు అన్ని జిల్లాల నుంచి చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉండడం బాధాకరమన్నారు. తాను ప్రారంభించబోయే పార్టీకి ఓ.వి.రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తాను ప్రారంభించబోయే పార్టీ ప్రారంభోత్సవానికి అన్ని మీడియా ఛానళ్లు రావాలని, తాను కొందరిని బహిష్కరించడం లాంటివి ఏవీ చేయబోనంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.




