పానీపూరీ తిని 150 మందికి అస్వస్థత
UPలో పానీపూరీ తిని 150 మంది అస్వస్థతకు గురయ్యా రు. సిద్ధార్థనగర్(D)లోని పెదారి, కల్నాఖోర్ ప్రజలు ఓ వీధి వ్యాపారి దగ్గర పానీపూరీ, ఆలూ టిక్కీ తిన్నారు. కొద్దిసేపటి తర్వాత వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యానికి గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది. ముందు రోజు మిగి
లిపోయిన ఆహార పదార్థాలను వ్యాపారి మిక్స్ చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.



