All
గ్యార్వీ షరీఫ్ ఊరేగింపులో కంట్రోల్ తప్పిన ఏనుగు
మహావత్, అటవీశాఖ అధికారులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
గ్యార్వీ షరీఫ్ ఊరేగింపులో కంట్రోల్ తప్పిన ఏనుగు
హైదరాబాద్ ఇరానీగల్లీలో గ్యార్వీ షరీఫ్ ఊరేగింపు సందర్భంగా ఏనుగు అదుపుతప్పడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే ఊరేగింపును నిలిపివేశారు.
ఊరేగింపులో ఏనుగు కదలికలు అసాధారణంగా మారడంతో దాన్ని వెంటనే ఆపినట్లు చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ తెలిపారు.
మహావత్, అటవీశాఖ అధికారులతో చర్చించిన అనంతరం ఏనుగును ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించారు.
ఏనుగును సురక్షిత ప్రాంతానికి తరలించారు.



