All

అనుమానంతోనే తన ప్రియురాలుని బండరాయితో మోది హతమార్చిన హంతకుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు.

వివరాలు.. తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సి.మల్లవరం గ్రామ సమీపంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో అక్టోబర్‌ 31న గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఆధారాలు లభించకపోవడం, మృతురాలి వివరాలు తెలియకపోవడంతో కేసు దర్యాప్తు సవాలుగా మారింది. మృతదేహం ఫొటోలు, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా మృతురాలు చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన భాగ్యశ్రీగా ఆమె తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. భాగ్యశ్రీ ఓ బ్యాంక్‌కు సంబంధించిన క్రెడిట్‌ కార్డు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగి్నషన్‌(ఏఎన్‌పీఆర్‌) కెమెరాల ద్వారా అనుమానిత వాహనాల కదలికలను విశ్లేషించారు. కాల్‌ డేటా రికార్డులు (సీడీఆర్‌), మొబైల్‌ టవర్‌ లొకేషన్ల ఆధారంగా మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. ఈ క్రమంలో అన్ని ఆధారాలు పరిశీలించిన తరువాత షేక్‌ జమాలుల్లా బాషా అలియాస్‌ జమీల్‌ బాషా (38) హత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker