All

హరహర మందిరంలో వైభవంగా కార్తీక దీపోత్సవం ​పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ 

సంజీవరెడ్డి దంపతులు, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ​చిన్నారుల కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు

​హరహర మందిరంలో వైభవంగా కార్తీక దీపోత్సవం
​పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్

సంజీవరెడ్డి దంపతులు, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
​చిన్నారుల కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు

ప్రయత్నం న్యూస్
​నారాయణఖేడ్:

నారాయణఖేడ్ మండల పరిధిలోని జీ.ఒకరానా గ్రామంలో గల హరహర మందిరంలో కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ఆయన సతీమణి అనుపమ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతర్గం పీఠాధిపతి కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ విచ్చేసి, కార్తీక పౌర్ణమి దీపారాధన వల్ల కలిగే విశిష్టత, ప్రయోజనాలను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనం అందించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఎందరో గురువుల ఆశీర్వాదంతో నారాయణఖేడ్ ప్రాంతం ఆధ్యాత్మిక, భక్తి మార్గంలో పయనిస్తోందని అన్నారు. అనంతరం గంగాపూర్ పాదయాత్రకు తీసుకెళ్లిన దత్త పాదుకలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య నృత్యాలు ఆకట్టుకోగా, వారిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.
​ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు వెంకటరమణారెడ్డి, రమేష్ రెడ్డి, డాక్టర్ అమృత, అశోక్ రెడ్డి, సురేష్ దొర, నరసప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు పండరి రెడ్డి, గ్రామ సర్పంచ్ బసిరెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పాండురంగారెడ్డి, దత్త భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker