మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం
అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయం – మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం
అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయం – మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం
జోగిపేట ప్రయత్నం న్యూస్:
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జోగిపేట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం, కరుణాకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో కుల, మత భేదాలు లేకుండా సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, ఎ. శంకరయ్య, బిర్ల శంకర్, సటికే రాజు, పల్లె వెంకట రమణ, రఫిక్, పెండ గోపాల్, లింగం, సంతోష్ యాదవ్, శ్రీనివాస్, బాజీ తదితరులు పాల్గొన్నారు.



