చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే ఎంపీ రఘునందన్ రావు
చేగుంట మండల కేంద్రంలోని శనివారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 అండర్ 17 అండర్ 19 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలకు ముఖ్యఅతిథిగా వచ్చిన మెదక్ ఎం. పి రఘునందన్ రావు

చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే ఎంపీ రఘునందన్ రావు
చేగుంట నవంబర్ 28 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని శనివారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 అండర్ 17 అండర్ 19 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలకు ముఖ్యఅతిథిగా వచ్చిన మెదక్ ఎం. పి రఘునందన్ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని అన్నారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు ఉపాధి, ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు 2% కోటా కింద ఎంతో ఉపయోగపడుతుందని, కావున ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన క్రీడలలో పాల్గొంటూ ఉన్న ఊరుకు, చదువుతున్న పాఠశాలకు, కళాశాలలకు, జిల్లాకు,రాష్ట్రానికి, దేశానికి తల్లి తండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోడీ గారు క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ఖేలో ఇండియా పోటీలు ప్రవేశపెట్టారని ఖేలో ఇండియా పోటీల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో పథకాలు సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారని ఆయన అన్నారు.
ఈ రోజు జరిగిన పోటీలలో
విజేతలు వీరే
అండర్ 14 బాలికల ఫాయిల్ విభాగంలో
అస్మిత, ఆధ్యా శశి,శాలిని, విగ్నేశ్వరి
సాబేర్ విభాగంలో జ్యోతి, శరణ్య, హాసిని,
స్వాతి
ఈపీ భాగంలో
మహిమ, జయలక్ష్మి, సారిక
,సాన్విక
అండర్ 14 బాలుర విభాగంలో
ఫాయిల్ విభాగంలో
లక్కీ, అజయ్,నవతేజ్,నవదీప్
సాబేర్ విభాగంలో
భరత్ ,మనోజ్, హర్షవర్ధన్,ప్రణీత్
ఈపీ విభాగంలో
మహేందర్,భరత్ రాజ్,హరికృష్ణ,సాత్విక్
అండర్ 17 బాలికల ఫాయిల్ విభాగంలో
కీర్తన,భవాని,ఎస్తేర్ రాణి,ఐశ్వర్య
సాబేర్ విభాగంలో
జెస్సికా, అనురాధ,వర్ష,అలేఖ్య
ఈపీ విభాగంలో
సహస్ర,దీప్తి,ఐశ్వర్య, కనకలక్ష్మీ
అండర్ 17 బాలుర ఫాయిల్ విభాగంలో
భానుచరణ,రంజిత్ కుమార్,రాహుల్,పండు
సాబేర్
రాకేష్,చరణ్,అరవింద్, ఆంజనేయులు
ఈపీ విభాగంలో
రిత్విక్,రాఘవేందర్, వినయ్ కుమార్, రంజిత్ కుమార్
అండర్ 19 బాలికల
ఫాయిల్ విభాగంలో
భార్గవి, యం. శ్రీజ,అశ్విత, ఎల్ శ్రీజ
సాబేర్ విభాగంలో
నిఖిత,హరిప్రియ,గీతిక, అర్చన
ఈపీ విభాగం లో
నందిని, ఎస్తేర్ రాణి, ధన లక్ష్మీ,ఉషశ్రీ
అండర్ 19 బాలుర ఫాయిల్ విభాగంలో
రాజేందర్,ప్రభాస్,స్టార్విన్
సాబేర్ విభాగంలో
విత్తు, నరేష్, వరుణ్ సందేశ్,చైతన్య
ఈపీ విభాగంలో
చందు,అజయ్, ఫైజాన్,జగదీష్
గెలుపొందారనీ కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు.గెలిచిన వీరందరూ వచ్చే నెల మొదటి వారంలో కరీంనగర్ జిల్లా రేకుర్తిలో జరిగే రాస్తాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు వీరి గెలుపు పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా కార్యనిర్వాహ కార్యదర్శులు నాగరాజు శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి గణపతి సమ్మయ్య హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్ స్పోర్ట్స్ ఇన్చార్జి ప్రమోద్ సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షుడు బైరి శంకర్ కళాశాల సిబ్బంది చేగుంట మండల బిజెపి అధ్యక్షులు ఎల్లారెడ్డి భూపాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుజాత మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య స్వాతి సంతోష్ రెడ్డి భూపాల్ రెడ్డి రతన్ తదితరులు పాల్గొన్నారు




