All

జోగిపేట శ్రీకృష్ణ గోశాలలో ఘనంగా నాల్గవ వార్షికోత్సవ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం.. భక్తులకు అన్నప్రసాద వితరణ

జోగిపేట శ్రీకృష్ణ గోశాలలో ఘనంగా నాల్గవ వార్షికోత్సవ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం.. భక్తులకు అన్నప్రసాద వితరణ

అందులో… ప్రయత్నం న్యూస్

జోగిపేట పట్టణంలోని శ్రీకృష్ణ గోశాల నాల్గవ వార్షికోత్సవ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డి.బి. నాగభూషణం పాల్గొని వేడుకలకు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గుప్త, జోగిపేట పట్టణ ప్రముఖులు రంగ సురేష్, చాపల వెంకటేశం, ఎ. రాంబాబు, జగన్ రెడ్డి, పత్తి వీరేశం, దిలీప్ కుమార్ జైన్, బిర్ల శంకర్, మల్లేశం, పల్లె వెంకట రమణ, మున్సిపల్ కౌన్సిలర్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గోశాల నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. గోవుల సంరక్షణ, పోషణతో పాటు గోసేవ ప్రాముఖ్యతను ప్రజల్లో చాటిచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

వార్షికోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ వేడుకలు జోగిపేట పట్టణంలో ఆధ్యాత్మిక సందడిని నింపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker