2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్…… ఇప్పుడున్న సీట్ల కంటే 50 శాతం పెరిగా అవకాశం….. రాష్ట్రాల్లో
సోమవారం లోక్సభ ముందుకు 132 వ రాజ్యాంగ సవరణ బిల్లు కొత్త డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్……ఇప్పుడున్న
సీట్ల కంటే 50 శాతం పెరిగా అవకాశం….. రాష్ట్రాల్లో
సోమవారం లోక్సభ ముందుకు 132 వ రాజ్యాంగ సవరణ బిల్లు
కొత్త డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
సికింద్రాబాద్ ప్రయత్నం న్యూస్ 
అందరూ ఊహించినట్టుగానే మోడీ సర్కార్ ఆశావాహులకు మరింత ఆశలు పెంచే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాలు ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికంటే 50% సీట్లు పెంచే అవకాశం ఉన్నట్టుగా దానికి సంబంధించిన విధివిధానాలను బయటకు చెప్పేసింది కొత్త డ్యూయల్ లిమిటేషన్ బిల్లుకు మహిళా రిజర్వేషన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గం సరిహద్దులు నిర్ణయించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే సోమవారం లోక్సభ ముందుకు 132వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చే అవకాశం ఉంది దీనిపై కేంద్రం తీసుకోనుంది ఈ విషయంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ సూచనప్రాయంగా తెలిపారు ఐదు నెలల ముందే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అయితే 2029 లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన తెలిపారు శుక్రవారం నాడు సికింద్రాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు ఢిల్లీలో జరుగుతున్న అంశాల మీద స్పందించారు మోదీ ప్రభుత్వం ఏ బిల్లు తీసుకొచ్చినా ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పునర్విభజన, మహిళా బిల్లును ప్రతిపాదిస్తారని, 2029 ఎన్నికల్లోనే మహిళా బిల్లు అమలయ్యేలా కేంద్రం ముందుకు వెళ్తోందన్నారు. త్వరలో సీఎం సొంత జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు, ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు చాలానే ఉన్నాయని, ఈ దఫా అన్నింటికీ లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని తెలిపారు.



