నిఖిత వినోద్ కుమార్ ఘనంగా నిశ్చితార్థం వేడుకలు..!
బంధువులు, మిత్రుల మధ్య ఆనందోత్సవాలు అభినందించిన పలువురు నేతలు
నిఖిత వినోద్ కుమార్
ఘనంగా నిశ్చితార్థం వేడుకలు..!

మర్పల్లి… ప్రయత్నం న్యూస్
మర్పల్లి మండలం బుదేరా
ఇద్దరి ప్రేమాభిమానాల మధ్య రెండు కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రులు కలిసి ఆనందోత్సవాల మద్య నిశ్చితార్థ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం బుదేరాలోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో మొగిలికుండ్ల గ్రామానికి చెందిన విట్టల్ కుమార్తె నిఖీత, వినోద్ ల నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, ఆత్మీయులు, గ్రామస్తుల సమక్షంలో ఈ వేడుక ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, అత్త మామలు, కుటుంబ సభ్యులు, మొగిలికుండ్ల గ్రామస్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలిసి జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు సంగమ్మ, విట్టల్ కుటుంబ సభ్యులు అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేనమామలు మల్లన్న పాటిల్, సంగన్న పాటిల్, చంద్రశేఖర్ పాటిల్, నాగన్న, పట్లోళ్ల శంకర్ పటేల్, మొగిలి గుండ్ల గ్రామ సర్పంచ్ రాచన్న పాటిల్, విశ్వనాథ్, పాటిల్ జగదీశ్వర్ నాగిశెట్టి రవి తదితరులు వేడుకలో పాల్గొని నూతన వదురులు నిఖీత, వినోద్ ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సందడితో నిశ్చితార్థ వేడుక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా సాగింది.


