All
బోనాల గ్రామంలో ఎల్ నినోపై గ్రామసభ

బోనాల గ్రామంలో ఎల్ నినోపై గ్రామసభ
చేగుంట నవంబర్ 28 ప్రయత్నం న్యూస్
చేగుంట మండలం బోనాల గ్రామం లో నిర్వహించిన ఎల్ నినో గ్రామసభకు మండల స్థాయి అధికారులు హాజరైనారు. ఇట్టి గ్రామసభ లో యం పి డి ఓ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వలన ప్రజలకు వచ్చే సమస్యల గురించి వివరించడమైనది మరియు గ్రామసభ అనంతరం జలమహోత్సవం కార్యక్రమం నిర్వహించానైనది. మిషన్ భగీరథ ఎ ఈ ఈ దివ్యశ్రీ మాట్లాడుతూ భవిష్యత్తు లో వచ్చే నీటి సమస్య గురించి వివరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమము లో యం.పి.ఓ ప్రకాష్ ,ఎ పి ఓ శ్వేత ,మిషన్ భగీరథ ఎ ఈ ఈ దివ్యశ్రీ ,హౌసింగ్ ఎ ఈ రియజుద్దిన్ ,వ్యవసాయ అధికారి హరిప్రసాద్, పంచాయతి కార్యదర్శి , సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.




