All

768వ ఉర్స్ షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర చాదర్ సమర్పణ.. మత సామరస్యం, సోదరభావం సమాజంలో మరింత బలపడాలి – డాక్టర్ చంద్రశేఖర్

768వ ఉర్స్ షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్

*దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర చాదర్ సమర్పణ.. మత సామరస్యం, సోదరభావం సమాజంలో మరింత బలపడాలి – డాక్టర్ చంద్రశేఖర్

కోహిర్ ప్రయత్నం న్యూస్:

కోహిర్ మున్సిపల్, మండల పరిధిలో నిర్వహించిన 768వ ఉర్స్ షరీఫ్ ఉత్సవాల్లో మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ ఇనాయత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పవిత్ర చాదర్ సమర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 768వ ఉర్స్ షరీఫ్ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. మత సామరస్యం, సోదరభావం, ఐక్యత, మానవత్వం వంటి గొప్ప విలువలు సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని మతాల ప్రజల మధ్య స్నేహభావాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ పవిత్ర ఉర్స్ షరీఫ్ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని డాక్టర్ ఏ. చంద్రశేఖర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కోహిర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లన్న పాటిల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాఫ్ఫర్ హుస్సేన్, వైస్ చైర్మన్ హన్నన్ జావేద్, మాజీ పట్టణ అధ్యక్షులు షంషీర్ అలీ, కౌన్సిలర్లు అబ్దుల్ అహ్మద్, జగదీష్, మహేష్ కుమార్, శ్రీకాంత్, మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మాజీ వైస్ ఎంపీపీ షకీర్ అలీ, కాంగ్రెస్ నాయకులు అష్రాఫ్, మాజిద్, పరమేష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker