పెద్ద హోటల్లో పెద్ద పెద్ద తప్పులు….

కుళ్లిపోయిన పదార్థాలు తింటున్న పెద్ద మనుషులు
హైదరాబాద్ అంటే అంత చులకన
హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
పెద్ద హోటల్లో ఎంతో నీటుగా ఏసీలో కూర్చోబెట్టి మసక మసక చీకట్లో కూర్చోబెట్టి లేటుగా తీసుకొచ్చి లేటెస్ట్ గా ఇచ్చినట్టుగా ఇచ్చి కష్టపడినట్లు చూపించి కుళ్లిపోయిన ఆహారానికి మసాలాలు పెట్టి ఖరీదైన ఫుడ్ గా తినిపిస్తున్నారు అది ఎక్కడో కాదు హైదరాబాదులోనే నిన్న అర్ధరాత్రి జరిగిన తనిఖీలలో బయటపడ్డ నిజాలు ఇవి కుళ్లిన ఆహార పదార్థాలతో వంటకాల తయారీ.. గుట్కాలు, పాన్‌మసాలాలు నములుతూ ఎంతో సీనియర్ వంటగాడిలాగా వండుతున్న వంటవాళ్లు.. ఎటు చూసినా శుభ్రత లేని వాతావరణం.. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ లో పాత బస్తీలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో పరిస్థితి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం శుక్ర, శనివారాల్లో గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో ప్రత్యేక బృందాలతో 20 కి పైగా ప్రముఖ రెస్టారెంట్లను తనిఖీలు చేయగా దారుణ పరిస్థితులు చూసి అధికారులే అవాక్కయ్యారు. కిచెన్లు, డైనింగ్ ఏరియాల్లో కనీస శుభ్రత పాటించడం లేదు. ఇలాంటి హోటళ్లలో తింటే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ హోటళ్లుగా పేరున్న వాటిలో నిబంధనల ఉల్లంఘనలు బయట పడటం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికారులు 10 హోటళ్ల లైసెన్సులు సస్పెండ్ చేసి తక్షణం వ్యాపారం నిలిపివేయాలని ఆదేశించారు. సరైన పరిశుభ్రత లేని తాజ్ ఫలక్‌నుమా హోటల్ సబ్జీ పిస్తాహౌస్ రెస్టారెంట్ స్వీకార్ హోటల్, మండి ఎట్ 36 అరేబియన్ కిచెన్ గోల్కొండ హోటల్ అండ్ రిసార్ట్స్ , ఇంపీరియల్ మల్టీక్యుసిన్ రెస్టారెంట్, తైజా బేకరీ హోటళ్లకు షోకాజ్ నోటీసులు అందించారు. 534 కిలోల చెడిపోయిన కూరగాయలు, మిగిలిపోయిన ఆహారం, గడువు తీరిన వస్తువులను అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు టీజీ సేఫ్ కమిషనర్ తెలిపారు.



