All

అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయకపోతే…. మీ ఉద్యోగాలు సరిగ్గా చేయలేరు….. ఓటర్లను బెదిరించిన నేతలు.

మొదటి విడత రెండవ విడత ఎన్నికల్లో జోరుగా బెదిరింపులు బెదిరింపులు లెక్కచేయని ఓటర్లు....

 

అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయకపోతే…. మీ ఉద్యోగాలు సరిగ్గా చేయలేరు….. ఓటర్లను బెదిరించిన నేతలు.
మొదటి విడత రెండవవిడత ఎన్నికల్లో జోరుగా బెదిరింపులు
బెదిరింపులు లెక్కచేయని ఓటర్లు….
చాలాచోట్ల సదిక్కులబడ్డ అధికార పార్టీ…. అతి విశ్వాసంతో ఎదురు దెబ్బతిన్న వైసీపీ
అమరావతి ప్రయత్నం న్యూస్
ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజల మనసుల్లో ఓటు అడిగేవారు ఎన్ని డబ్బులు ఇస్తారు అది ఒకే ఒక ఆలోచన మెదులుతుంది అది తప్పు అని తెలుసుకున్న ప్రజలకు కష్టాలు చెప్పుకునే వారెవరు అని ఆలోచన వస్తుంది ఈ రెండు ప్రజలతో ప్రజల కొరకు ఉండే వారి కోసమే పనికొస్తాయి కానీ మొత్తం మీద డబ్బులు బాగా పనిచేస్తాయని చెప్పుకుంటారు కానీ మరొకటి కూడా పనిచేస్తుంది అదేంటంటే బెదిరింపు ఈ బెదిరింపులు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులను కొంతమేరకు బెదిరిస్తున్నారని సమాచారం వస్తుంది మొదటి విడత పోలింగ్ లోను రెండో విడత పోలింగ్ లోను ఈ బెదిరింపులు వచ్చాయి అని స్పష్టంగా చెప్పే వారు కూడా ఉన్నారు . వారు ఎవరంటే ఉద్యోగులకు సంబంధించిన యూనియన్ నాయకులు అటు పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఇటు టీచర్స్ గాని మరోవైపు రెవిన్యూ అధికారులు కానీ ఇలా ఎవరి యూనియన్లకు సంబంధించిన వారు వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఓటు వేసే సమయం వచ్చేసరికి ఈసారి ఓట్లు మారిపోయాయి పూర్తిస్థాయిలో టిడిపి పరిపాలన ఎంతో అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చింది టిడిపి ఆశించిన తీరు వచ్చిన రిజల్ట్ కూటమి ప్రభుత్వానికి కొంత నిరాశ మిగిల్చిందని చెప్పుకోవాలి 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసిపి ఎక్కడ కూడా ఒక్క పంచాయతీ గాని ఒక్క వార్డు మెంబర్ గాని ఒక్క ఎంపీటీసీ గాని ఒక జడ్పిటిసి గాని ఒక మున్సిపాలిటీ గాని ఒక కార్పొరేషన్ గాని గెలిచే పరిస్థితి ఉండదు అని అందరు భావించారు కానీ వైసీపీ ఎలా భావించలేదు చంద్రబాబు మీద వస్తున్న వ్యతిరేకతను అడ్డుపెట్టుకొని మనం చెప్పకపోయినా మనకు ఓటింగ్ పడుతుందని ఆశలో ఉన్నారు కానీ చంద్రబాబు రాజనీతిని ఉపయోగించి ఆయన గెలవాల్సిన సీట్లు ఆయన ఇప్పుడు గెలిచారు కానీ అక్కడక్కడ టిడిపికి సంబంధించిన కేడర్లో మార్పులు చేర్పులు ఉండడం వల్ల కొన్ని గెలవడం కష్టంగా అయిపోయి తప్పని పరిస్థితులు ఓడిపోవాల్సి వచ్చింది . ఇక వైసిపి అయితే తనకు తిరుగులేదు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన మేమే గెలుస్తామని చెప్పుకుంటున్న వారికి ఈ గెలుపు ఓటమిలో వచ్చిన ఓట్లు సీట్లు చూస్తే నెక్స్ట్ కూడా మన పరిస్థితి ఏంటి అనే ఒక అనుమానం తలెత్తుతుంది ఉద్యోగులను బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూడడం చాలా తప్పు ఆ తప్పును చంద్రబాబు చేస్తాడని పవన్ కళ్యాణ్ చేస్తాడని బిజెపి నేతలు చేస్తారని ఎవరు అనుకోరు కానీ జరిగింది వాస్తవం అర్ధరాత్రి బెదిరింపులు ఆపై కక్ష సాధింపు చర్యలు అనే రీతిలో ఓట్లు సరిగ్గా వేయకపోయినా అధికార పార్టీకి సానుభూతి చూపించకపోయినా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కఠినంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఎవరి ఊరు వారిది ఎవరి వాడ వారిది ఎవరు సమస్య వారిది కాబట్టి వారు ఓటు ఎక్కడ వేయాలో అక్కడే వేసుకున్నారు రిజల్ట్ ఎట్లా రావాలో అట్లాగే వచ్చింది కాబట్టి రాజకీయ నేతలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో బెదిరిస్తే బెదిరిపోయే ఉద్యోగులుగాని ఓటర్లు గాని ఎవరూ లేరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker