All
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించిన రాయపాటి, ప్రజా జీవితంలోనూ, పార్టీ అభ్యున్నతిలోనూ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



