అయ్యప్ప యాత్రకు సంబంధించిన వర్చువల్ క్యూ బుకింగ్ తేదీ ఖరారైంది.
www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అయ్యప్ప యాత్రకు సంబంధించిన వర్చువల్ క్యూ బుకింగ్ తేదీ ఖరారైంది. అమరావతిప్రయత్నం న్యూస్ అయ్యప్ప భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేరళంలోని శబరిమల మండల మకరవిళక్కు యాత్రకు సంబంధించిన వర్చువల్ క్యూ బుకింగ్ తేదీ ఖరారైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని నియంత్రించి, యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు రోజువారీ బుకింగ్ పరిమితులను నిర్ణయించారు. పంబ నుంచి సన్నిధానం చేరుకునే భక్తులు వర్చువల్ క్యూ పాస్ పొందడం తప్పనిసరి.
కొన్ని చోట్ల స్పాట్ బుకింగ్ కేంద్రాలు
వర్చువల్ క్యూ బుకింగ్ కోసం భక్తులు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారిక పోర్టల్
ప్రధాన మార్గమైన నిలక్కల్-పంబ ద్వారా రోజుకు 60 వేల మంది భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ అవకాశం కల్పించారు. ఎరుమేలి అటవీ మార్గం, వండిపెరియార్-సత్రం మార్గాల ద్వారా రోజుకు 3 వేల మంది చొప్పున భక్తులు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోలేని భక్తుల కోసం కొన్ని ప్రాంతాల్లో స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
బుకింగ్ పూర్తి ఉచితం: వర్చువల్ క్యూ బుకింగ్ ఉచితమని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. భక్తులు కోరుకుంటే ‘యాత్ర సహాయక నిధి’, ‘సాధారణ నిధి’కి కనీసం రూ.5 నుంచి స్వచ్ఛందంగా విరాళం అందించవచ్చు. పారిశుద్ధ్యం, నిర్వహణ వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగిస్తారు.



