Allసినిమాలు

రాజకీయంలోకి రానున్న నటి మాధవీలత..

నచ్చావులే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నటి మాధవీలత.. ఇటీవలే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయంలోకి దూకింది. బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యింది. అనారోగ్య కారణాలతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుంది. తన ఫేస్ బుక్ పేజీలో చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ఆమె మరోసారి దీనిపై స్పందించి వివరణ ఇచ్చింది.
‘డియర్ మీడియా మీరు నాపై చూపిస్తోన్న మీ అమితమైన ప్రేమకు కృతజ్ఞతలు.. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.. ఉంటాను..కానీ, చచ్చిపోతానని చెప్పిన న్యూస్‌ని ప్రచారం చేయకండి. నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు. నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే… మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి వచ్చి అలా చెప్పాను. కానీ, పరిస్థితులు ఇలా మారుతాయని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను జస్ట్ క్యాజువల్ గా నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను’ అని ఆమె వివరణ ఇచ్చింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker